All about Computer

Thursday, November 21, 2019

wifi సాంకేతికంగా ఎలా పనిచేస్తుంది?

*wifi సాంకేతికంగా  ఎలా పనిచేస్తుంది?*

✳wifi అంటే wireless fidelityకి సంక్షిప్త రూపం (abbreviation) గా భావించాలి. ఇప్పుడెవరూ ఇంటర్‌నెట్‌ అంటే ఇంటర్నేషనల్‌ నెట్‌వర్క్‌ అనే పెద్ద పేరుకు సంక్షిప్త రూపంగా భావించనట్టే, వైఫై కూడా అలాగే అలవాటైపోయింది. తీగల (wires) తో సంధానించాల్సిన అవసరం లేకుండా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, సెల్‌ఫోన్లు, కెమేరాలు, వీడియోలు, టీవీల్లాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను నిస్తంత్రీ పద్ధతి (wireless mode)లో సంధానం చేయడానికి ఈ సాంకేతికతను వాడుతున్నారు. సాధారణంగా ఒకే ప్రదేశంలో ఉండే పరికరాలను వైఫై సర్వర్‌ ద్వారా అనుసంధానం చేస్తారు. ఆయా పరికరాలు ఈ సాంకేతికతను వాడడానికి అనుకూలంగా తయారైనవై ఉండాలి. ఇలాంటి సర్వర్‌ను హాట్‌స్పాట్‌ లేదా యాక్సెస్‌ పాయింట్‌ అంటారు. దీని చుట్టూ సుమారు 20 మీటర్ల పరిధిలోని పరికరాలను అనుసంధానం చేయడానికి ప్రత్యేక ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్‌ను సహాయంతో మైక్రోవేవ్‌ తరంగాల ద్వారా నెలకొల్పుతారు. ఇలా సంధానించిన పరికరాల మధ్య సమాచార మార్పిడి వీలవుతుంది. అంటే తీగలు లేకుండానే ఆయా పరికరాలను పనిచేయించడం సాధ్యమవుతుందన్నమాట.

No comments:

Post a Comment